Monday, January 8, 2018

బ్రహ్మశ్రీ విద్వాన్ శతావధాని భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి గారు (Brahmasri Vidwaan Satavadhani Bhamidipaati Ayyappa Sastry garu )A great legend

 బ్రహ్మశ్రీ విద్వాన్ శతావధాని భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి గారు -(Brahmasri Vidwaan Satavadhani Bhamidipaati Ayyappa Sastry garu )A  great legend


తెలుగు సారస్వత రంగంలో ఎందఱోమహానుభావులు ,వారిలో ఒక అనర్ఘరత్నం బ్రహ్మశ్రీ విద్వాన్ శతావధాని భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి గారు .నాకు గురుతుల్యులు ,నా భార్య శ్రీ సుశీల కి ప్రపితామహులు అయిన అయ్యప్పశాస్త్రి వంటి మహానుభావులగురించి  గురించి ఇప్పటి తరం తెలుసుకోవాలనే  తాపత్రయం తో ఆయన జీవిత విశేషాలు ,ఆయన ప్రతిభాపాటవాలు గురించి మేము విన్నది,తెలుకున్నది క్లుప్తం గా ఇక్కడ వివరిస్తున్నాం .అవధరించండి . 
బ్రహ్మశ్రీ అయ్యప్ప  శాస్ర్త్రి గారు ఆంద్ర ,గీర్వాణ భాషలలో అపారమైన పాండితీ పటిమనార్జించి ,ఆంధ్ర భాషారాధకులై బహు రమణీయమ,మృదు మధుర శైలితో కూడిన పదజాలంతో పాతికకి పైగా గ్రంథరచనలు చేసి,అద్భుతమైన ఆశుకవితాపటిమ తో ఎన్నో అష్టావధానాలు,శతావధానాలు చేసి ఆశుకవితలు చెప్పి పండిత పామర లోకాన్ని అలరించి,మన్ననలు పొందారు 

    అయ్యప్ప  గారు కృష్ణా జిల్లా ముదినేపల్లి( కృష్ణాజిల్లా)లో  1888 లో జన్మించారు .పూర్వ నివాసం పశ్చిమ  గోదావరి జిల్లా .ఆకువీడు ,తరువాత కృష్ణా జిల్లా సిద్ధాంతం ,గుడివాడ ,విజయవాడ

            బ్రహ్మశ్రీ అయ్యప్ప శాస్త్రిగారి కుటుంబ వివరాలు

---------------------------------------------------
తండ్రి :భమిడిపాటి సుబ్బావధానులు గారు 
తల్లి :భమిడిపాటి గారమ్మ గారు 
 ఒక సోదరుడు కామేశ్వర శాస్త్రి 
రామమ్మ ,సుబ్బమ్మ ,మహాలక్ష్మమ్మ ,సూర్యకాంతమ్మ ,లక్ష్మీనరసమ్మ, దుర్గమ్మ అను ఆరుగురు సోదరీలు
భార్య :భమిడిపాటి పేరమ్మ 
పుత్రులు ; అచ్యుతరామ శాస్త్రి ,సుబ్బావధాని ,విజయకృష్ణ మూర్తి ,పాండురంగ స్వామి 
పుత్రికలు :సుబ్బమ్మ ,వెంకట సుబ్బమ్మ ,పోషిత కనక దుర్గాoబ ,రోచిష్మతీ సౌభాగ్య కామేశ్వరి ,సత్యవాణి ,దయావతి ,మధురవాణి ,కమలావతి ,మధురావతి
                                       విద్యాభ్యాసము 
బాల్యం లో యజుర్వేద సంహిత బ్రాహ్మణములను అధ్యనం చేశారు. ప్రసిద్ధ విద్వాన్సుల వద్ద సంగీతం  పిమ్మట గీర్వాణ భాషకూడా అభ్యసించి కావ్య,నాటక ,అలంకారాలను సంపూర్తి చేశారు వ్యాకరణ సిద్ధాంత కౌముది చెళ్లపిళ్ల చిన వెంకటశాస్త్రి (చెళ్ళపిళ్ళ వెంకట  శాస్త్రి శతావధాని గారి సోదరుడు)  ఉపాధ్యాయ వృత్తికై ఎలిమెం టరీ గ్రేడ్ ట్రైనింగ్ పాసై,యానిమల్ ఫిజియోలజీ,హైజిన్ అను టెక్నికల్  పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు . 1921 లో మద్రాస్ యూనివర్సిటీ ఏ  గ్రేడ్ విద్వాన్ పరీక్షలలో కృతార్ధత పొందెను . 
                                                ఉద్యోగం 

కృష్ణా జిల్లాలో వివిధ స్థలముల లో ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా,ప్రధాన ఉపాధ్యాయుని గా పని చేశారు 

1918 వ సంవత్సరం నుండి 1921 వ సంవత్సరం  వరకు పశ్చిమ  గోదావరి జిల్లా `ఉండి " బోర్డు హై స్కూల్ సీనియర్ తెలుగు పండితుడిగాను . 1922 వ సంవత్సరం నుండి 1942 వరకు కృష్ణా జిల్లా గుడివాడ బోర్డు హై స్కూల్ లో తెలుగు ,సంస్కృతం భాషలు రెండింటిలోనూ సీనియర్ పండితులుగా పనిచేశారు .. 
1943 వ సంవత్సరం లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట బోర్డు హై స్కూల్ లో సీనియర్ తెలుగు పండితునిగా పనిచేసి రిటైర్ అయ్యారు . 
        తరువాత  అనేక స్థలములలో పనిచేశాక విజయవాడ ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షర శాల (ప్రింటింగ్ ప్రెస్ )సంశోధకుడిగా పనిచేశారు ఆయన శిష్యులు అనేకులు  వృద్ధిలోనికి వచ్చి మంచిస్థితికి వెళ్లారు 
 అయ్యప్పశాస్త్రి గారు చక్కని కవి.ఎన్నో అష్టావధానాలు,శతావధానులు చేసి ఆశుకవిత్వము చెప్పి ప్రజల మన్ననలు పొందారు 
అయ్యప్ప శాస్త్రి గారు  రచించిన గ్రంధాలు 
1రామతారకావళి 2.రామ శతకము 3.నాగేశ్వర శతకము 4. భక్తి రస ప్రధాన కీర్తన శతకము 5.ఆంధ్ర రఘు వంశము 6.అనిరుద్ధ వివాహం 
7.హనుమద్ విజయం 8.అన్నదాన మహిమము .9.మీరాబాయి చరిత్రము .10.వేమన తారావళి . 11.సుశీల 12.భవిష్యత్ పురాణము 
13.సీతారామచంద్ర ప్రభోధము . 14,వేంకటేశ్వర మహాత్మ్యం 15.చంద్రమౌళీశ్వర చిద్విలాసం 16.చెన్నకేశవ వినోదము 17.రంగనాయక స్త్రోత్రము .18.హయగ్రీవావతారము 19.మధుకై టభ భంజనము . 20పురూరవ జననము .21  శుక విలాసము 22.సాధ్వీమణి (అనసూయ )
 23..శ్రీవేదాద్రి లక్ష్మి నృసింహ గర్భ వృత్త సామరస్యము 24.అక్రూర చరిత్రము 25.గణపతి మాహాత్మ్యము 26.శ్రీ కుమారాభ్యుదయము 
27.మేఘ సందేశము 28.గణపతి సంగ్రహ చరిత్ర 29.కిరార్టార్జ్యునీయం 30.దుర్గామల్లేశ్వర స్త్రోత్రము 
                                  -----------
  

బ్రహ్మశ్రీ అయ్యప్ప శాస్త్రి గారిని వరించిన బిరుదులు 

1.బన్ధగర్భ కవి సమ్రాట్ 
2.ఆశుకవి 
3.శతావధాని 
4.విచిత్ర కవి                                    -----------
   ప్రముఖ శతావధాని మరియు మద్రాస్ ప్రభుత్వ ఆస్థాన కవీశ్వరుడు శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి పలికిన పలుకులు శ్రీ  అయ్యప్పశాస్త్రి  గారిని ఆశీర్వదిస్తూ;
``భగవంతుడు ఇతనికి శ్రేయహ్ప్రదాత యగుగాక యని ఆశీర్వచనం చేయుచున్నాడను ''
                              పండితుల ప్రశంసలు 
                         ----------------------------
మీ ``వేదాద్రి లక్ష్మీ నరసింహ వృత్త నరసింహ గర్భవృత్త సామరస్యము ''అను గ్రంధరాజము ను; మేఘసందేశము చదివి ఆనందించితిని . 
``బన్ధగర్భ కవి సామ్రాట్ ;; అను బిరుదు తమకే చెల్లునని నా మనవి . 
                                              శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వఝల చిన సీతారామ శాస్త్రి 
                                                  విశాఖపట్నం ,23/07 /1949
                                  -----------------
`` అవధాని బహూనమస్కారపూర్వకముగా చేసుకున్న విన్నపాలు .మీ  ``వేదాద్రి లక్ష్మీ నరసింహ వృత్త నరసింహ గర్భవృత్త సామరస్యము '' శ్రద్ధతో పఠించితిని .తాము పడిన శ్రమకును ,గర్భవృత్తము అభిప్రాయము చెడకుండా ధార సడలకుండా కూర్చిన తమ నేర్పునకు నేను ఎంతయో అచ్చెరువు నొందితిని .మేఘసందేశము సాంతము గ చదివితిని .అనువాదమయ్యు ,స్వతంత్ర కావ్యమవలే మిక్కిలి మనోహరముగా నున్నది 
                                          దివాకర్ల వెంకటావధాని M.A (honours )
                          తెలుగు లెక్చరర్ ,Mrs. A .V.N కాలేజీ ,విశాఖపట్నం
                                         --------- 
మహా కవి కాళిదాసు మేఘసందేశమునకు అనువాదముగా శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి గారు రచించినఆంద్ర పద్య కావ్యము గీర్వాణ భాష నభిజ్ఞులకు అందరాణిఫలమును చేతికందించుటయే కాక మూలమును చదువుకొనువారికి కూడా మిక్కిలి ఆనందమును కలిగించుచున్నది . 
                                         జటావల్లభుల పురుషోత్తం M.A 
                           సౌంస్కృత లెక్చరర్ ,S.R.R.College ,విజయవాడ 
                                   --------------
శ్రీ శాస్త్రి గారు``బంధకవి సామ్రాట్ " ``ఆశుకవి ''``శతావధాని '' ``విచిత్రకవి ''
ఇత్యాది బిరుదాంచితులని నడుపుటలో నా చదివిన వీరి రచనలే తార్కాణములు . 
గ్రంథకర్తగా ఆంధ్ర గీర్వాణ భాషలందు అపార పాండితీ పటిమ ఆర్జించి ఆంధ్రభాషారాధకులై తర్కవితావాసనా పరంపరలచే బహు రామణీయంబులును ,మృదు మధుర శైలి సంశోభితములును అయి చెలువొందునచ్చ తెలుగుపడజాలములచే విలసితంబులై యొప్పు తెలుగు కబ్బముల పెక్కింటిని రచించితిరి .దానికి దృష్టాంతమీ ``మేఘసందేశమ''య్యు ,ఇందు ముఖ్యముగా ఉత్తర మేఘము మిక్కిలి యొప్పుచున్నయది . 
                                                           సుసర్ల వెంకటేశ్వర శాస్త్రి , 
                                         ఆంద్ర గ్రంధాలయ ప్రెస్ పండిట్ విజయవాడ 





No comments:

Post a Comment